గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Aug 20, 2020 , 11:05:01

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

సంగారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. డీసీఎం ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన జహీరాబాద్ మండలంలోని కొత్తూరు గ్రామ శివారులో జరిగింది. ఈ దుర్గఘటనలో ప్రశాంత్ (25)  అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన ప్రశాంత్.. రోడ్డు దాటుతున్న క్రమంలో డీసీఎం వేగంగా వచ్చి ఢీ కొట్టింది. జహీరాబాద్ రూరల్ ఎస్ఐ వినయ్ కుమార్ ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.logo