ఆదివారం 24 జనవరి 2021
Crime - Jan 11, 2021 , 18:43:23

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

మెదక్‌ : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన జిల్లాలోని మనోహరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి ఎస్‌ఐ రాజుగౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మనోహరబాద్‌ మండలం లింగారెడ్డిపేట గ్రామానికి చెందిన పోలాస్‌ కృష్ణ (27) తన అమ్మమ్మ ఊరైన నవాబ్‌పేటకు శనివారం వెళ్లి ఆదివారం రాత్రి తిరుగు ప్రయాణం అయ్యాడు. ఈ క్రమంలో లింగారెడ్డిపేట చౌరస్తా వద్ద ఆదివారం రాత్రి ఆటో దిగి నడుచుకుంటు వస్తుండగా అదే గ్రామానికి చెందిన శ్రీను తన ద్విచక్ర వాహనాన్ని అజాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చి కృష్ణను వెనుక నుండి ఢీ కొన్నాడు. ఈ ప్రమాదంలో కృష్ణ తీవ్రగాయాలపాలై మృత్యువాత పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్‌ మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ  తెలిపారు.

ఇవి కూడా చదవండి..

ప్రభుత్వ పథకాల అమలులో ఎంపీడీవోలు కీలకం

మిషన్ భగీరథ పెండింగ్ పనులను పూర్తి చేయండి 

కూతురు పరీక్ష కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు 

క్రికెట్ ఆడుతూ యువకుడు మృతి


logo