Crime
- Jan 03, 2021 , 20:12:05
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ఖమ్మం : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. సత్తుపల్లి మండలం కృష్టారంకు చెందిన అశోక్ కుమార్ (22) అనే యువకుడు సత్తుపల్లిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఫార్మసిస్ట్‌గా పని చేస్తున్నాడు. విధుల కోసం ఆదివారం సాయంత్రం స్వగ్రామం నుంచి మోటార్ సైకిల్ పై వస్తుండగా ఎదురుగా వస్తున్న బర్రెలు కనిపించకపోవటంతో వాటికి తగిలి రోడ్డు మీద పడి అక్కడికక్కడే చనిపోయాడు.
మోటార్ సైకిల్ పై వస్తూ హెల్మెట్ పెట్టుకున్నప్పటికీ ప్రమాదం జరిగిన సమయంలో అది ఊడి పోయింది. హెల్మెట్ పెట్టుకున్నప్పటికీ క్లిప్పు పెట్టుకోకపోవడంతో హెల్మెట్ పూడి పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో ప్రమాదం సంభవించిందని వారు తెలిపారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
- లాజిస్టిక్ పార్క్ రెడీ..
- తెలుగు భాషకు ప్రాణం పోసిన మహనీయుడు ‘గిడుగు’
- ఘనంగా పద్మమోహన-టీవీ అవార్డ్స్...
- బాధితులకు సత్వర న్యాయం అందించడానికి కృషి
- త్యాగధనుల కృషి ఫలితమే గణతంత్రం
- సీసీఎంబీ పరిశోధనలు అభినందనీయం
- కామునిచెరువు సుందరీకరణపై స్టేటస్కో పొడిగింపు
- సీజనల్ వ్యాధులపై వార్
- రాణిగంజ్ ఆర్యూబీ విస్తరణకు చర్యలు
- ఆటకు లేదు లోటు
MOST READ
TRENDING