మంగళవారం 26 జనవరి 2021
Crime - Nov 11, 2020 , 13:16:24

బెట్టింగ్‌ దందాతో ఇద్దరు యువకులు ఆత్మహత్య యత్నం..ఒకరు మృతి..

 బెట్టింగ్‌ దందాతో ఇద్దరు యువకులు ఆత్మహత్య యత్నం..ఒకరు మృతి..

అమరావతి: గుంటూరు జిల్లాలో ఐపీఎల్‌ బెట్టింగ్‌ దందాకు యువకుడు బలయ్యాడు. తాళ్లూరికి చెందిన సురేష్‌, కొమరయ్య... ఐపీఎల్‌లో పందాలు కాసి నష్టపోయారు. డబ్బుల కోసం నిర్వాహకులు ఇద్దరిపై ఒత్తిడి తీసుకురావడంతో... డబ్బు కట్టలేక ఆ ఇద్దరు యువకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైల్వే ట్రాక్‌ దగ్గర పురుగుల మందు తాగారు. తాము చనిపోతున్నామంటూ సెల్ఫీ వీడియో తీసి బంధువులకు పంపారు. వెంటనే స్పందించి ఘటనాస్థలానికి వెళ్లిన బంధువులు... ఇద్దర్నీ గుంటూరులోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ సురేష్‌ చనిపోగా... కొమరయ్య పరిస్థితి విషమంగా ఉన్నది. చిలక జోస్యం చెప్పుకుంటూ జీవిస్తున్నామని, తమ బిడ్డను ఉన్నతంగా చదివించాలని ఆశపడ్డామని సురేష్ తల్లి వెంకటమ్మ బోరున విలపించింది. సురేష్ ని ఇంటర్ వరకు చదివించామని అయితే స్నేహితుల వల్ల బెట్టింగ్ లకు అలవాటు పడ్డాడని ఆమె తెలిపింది. సత్తెనపల్లి కి చెందిన బాజీ , పేరేచర్ల కు చెందిన తిరుపతయ్యలు సురేష్ ను రోజు తీసుకెళ్ళేవారని, సత్తెనపల్లి లో బైక్ తాకట్టు పెట్టు 30 వేలు చెల్లించాడని ఇప్పుడు మిగిలిన డబ్బు కూడా కట్టాలని ఒత్తిడి చేస్తున్నారని ఆమె పేర్కొన్నది. బెట్టింగ్ నిర్వాహకుల వేదింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడని సురేష్ తల్లి ఆరోపించింది.సరికొత్త టెక్నాలజీతో ఆపిల్ మ్యాక్ బుక్ మోడల్స్ 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo