ఆదివారం 24 జనవరి 2021
Crime - Oct 10, 2020 , 15:38:12

ఆటోను ఢీకొట్టిన బైక్‌.. యువకుడు దుర్మరణం

ఆటోను ఢీకొట్టిన బైక్‌.. యువకుడు దుర్మరణం

భద్రాద్రికొత్తగూడెం : బైకు అదుపుతప్పి ఆటోను  ఢీకొని యువకుడు మృతిచెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలో శనివారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. అశ్వాపురం మండల కేంద్రం పరిధిలోని అంబేద్కర్‌ నగర్‌కు చెందిన పేట ప్రణయ్ కుమార్(17) స్నేహితుడు గద్దల ఈశ్వర్‌తో కలిసి భోజనం చేసేందుకు బైక్‌పై జగ్గారం సమీపంలోని దాబా కు బయల్దేరారు.

అశ్వాపురంలోని పెట్రోల్‌ బంక్‌ వద్దకు రాగానే బైక్‌ అదుపుతప్పి కొత్తగూడెం వైపు వెళ్తున్న ఆటోని ఢీకొట్టి లారీ కిందపడ్డారు. దీంతో ప్రణయ్‌ కుమార్‌ తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే మృతి చెందాడు. ఈశ్వర్‌కు గాయాలుకాగా చికిత్స నిమిత్తం పోలీసులు అశ్వాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo