ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Aug 11, 2020 , 13:41:44

విద్యుత్ షాక్ తో యువకుడు మృతి

విద్యుత్ షాక్ తో యువకుడు మృతి

వరంగల్ రూరల్:  జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి వద్ద కరెంట్ మోటర్ ఆన్ చేస్తుండగా ప్రమాదం జరుగడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన నాగరాజు(21) డిగ్రీ పూర్తి చేసి తల్లిదండ్రులకు ఆసరగా ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఈ క్రమలో ఇంటి వద్ద మోటర్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్ తో అక్కడిక్కడే మృతి చెందాడు. ఎదిగి వచ్చిన కొడుకు ఇంటికి ఆసరగా అవుతాడుకుంటే మృత్యువాత పడటంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.logo