ఆదివారం 24 జనవరి 2021
Crime - Dec 29, 2020 , 21:47:52

విద్యుత్‌ షాక్‌తో యువకుడి మృతి

విద్యుత్‌ షాక్‌తో యువకుడి మృతి

మహబూబాబాద్ : మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మున్సిపల్‌ కేంద్రంలోని ఓ ఇంటి నిర్మాణ పనుల కోసం కూలికి వచ్చి యువకుడు విద్యుత్‌ షాక్‌తో గురై  మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. సదరు ఇంటి యజమాని ఆదుకోవాలని మృతుడి బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. అప్పటి వరకు మృతదేహాన్ని అక్కడి నుంచి తీసేది లేదని భీష్మించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్థానికుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు గ్రామానికి చెందిన బండారు ఎల్లయ్య(35) మరిపెడ బంగ్లాలోని అనబత్తుల ఉపేందర్‌ ఇంటి నిర్మాణానికి కూలికి వచ్చాడు.

ఈ క్రమంలో ప్రమాదవ శాత్తు బోరు మోటరు తీగలు గడ్డపారకు తగిలి విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన మృతుడి బంధువులు అక్కడికి చేరుకొని బోరున విలపించారు. మృతుడి కుటుంబాన్ని సదరు యజమాని ఆదుకోవాలని మృతదేహాన్ని సాయంత్రం వరకు తీయలేదు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటానని ఇంటి యజమాని ముందుకు రావడంతో బంధువులు శాంతించారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.logo