గురువారం 25 ఫిబ్రవరి 2021
Crime - Jan 25, 2021 , 21:32:11

మేక పిల్లను రక్షించబోయి యువకుడు మృతి

మేక పిల్లను రక్షించబోయి యువకుడు మృతి

సంగారెడ్డి :  చెరువులో మునిగిపోతున్న మేక పిల్లను రక్షించబోయి యువకుడు ప్రాణాలో కోల్పోయారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని  కిష్టారెడ్డి పేటలో సోమవారం ఈ విషాద ఘటన జరిగింది.  గ్రామానికి చెందిన షేక్‌ అసద్‌ (18) ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మేక పిల్లకు జబ్బు చేయడంతో పశువుల దవాఖానకు తీసుకెళ్లాలని అసద్‌ను తల్లి పురమాయించింది.

దీంతో  తమ్ముడు షేక్‌ అలీబాబాతో కలిసి మేక పిల్లలను తీసుకొని దవాఖానకు బయల్దేరాడు. మార్గమధ్యలో  మేక పిల్లలను వీధి కుక్కలు వెంబడించడంతో పరిగెత్తుతూ వెళ్లి సమీపంలోని చెరువు పడిపోయింది. దీన్ని గమనించిన అసద్‌ మేక పిల్లలను రక్షించేందుకు చెరువులోకి దూకాడు. ఈత రాకపోవడంతో నీట మునిగాడు. అలీబాబా కేకలు వేయడంతో స్థానికులు ఘటనాస్థలానికి చేరుకొని మేక పిల్లను రక్షించారు. అసద్‌ను మాత్రం రక్షించలేకపోయారు. రెండు గంటల తరువాత అసద్‌ మృతదేహం బయటపడింది. మృతుడి బాబాయి ఎండీ ముజాహిద్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo