శుక్రవారం 22 జనవరి 2021
Crime - Jan 13, 2021 , 19:30:31

యువకుడి దారుణ హత్య.. కత్తితో పొడిచి ఘాతుకం

యువకుడి దారుణ హత్య.. కత్తితో పొడిచి ఘాతుకం

హైదరాబాద్‌ :  నగరంలోని పశ్చిమ మండలం మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. చాంద్‌ (17) అనే యువకుడిని అజ్జు అనే మరో యువకుడు కత్తితో పొడిచి పాశవికంగా హతమార్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. చాంద్‌ మృతదేహాన్ని ఉస్మానియా దవాఖాన మార్చురీకి తరలించారు. అజ్జు పరారీలో ఉన్నట్లు తెలుస్తున్నది. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా మంగళ్‌హాట్‌ ప్రాంతంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo