శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Aug 20, 2020 , 14:34:25

జాతీయజెండాను చింపివేసినందుకు యువకుడు అరెస్ట్‌

జాతీయజెండాను చింపివేసినందుకు యువకుడు అరెస్ట్‌

రణఘాట్ : పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలో జాతీయ పతాకాన్ని చింపివేసినందుకు గాను ఓ యువకుడిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నాడియా జిల్లాలోని ధంతాలా పోలీస్‌స్టేషన్‌ పరిధి పారా స్కూల్‌ ప్రాంతంలో చంచల్‌ బిస్వాస్‌ అనే వ్యక్తి బుధవారం జాతియ జెండాను చింపివేశాడు. ఈ సన్నివేశాన్ని స్థానికులు వీడియో తీసి పోలీసులకు ఫార్వార్డ్‌ చేయడంతో చంచల్‌ బిస్వాస్‌ను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువకుడిని విచారించగా తాను మద్యం తాగి ఈ పనిచేశానని తెలిపాడు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo