శుక్రవారం 22 జనవరి 2021
Crime - Dec 09, 2020 , 15:49:51

చెట్టుకు ఉరేసుకుని యువ‌తీ, యువ‌కుడు అత్మ‌హ‌త్య‌

చెట్టుకు ఉరేసుకుని యువ‌తీ, యువ‌కుడు అత్మ‌హ‌త్య‌

బ‌దౌన్‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం బ‌దౌన్ జిల్లా ముజాహిద్‌పూర్ గ్రామంలో ఈ ఉద‌యం ఘోరం జ‌రిగింది. చెట్టుకు ఉరేసుకుని ఓ యువతీ, యువ‌కుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. వివ‌రాల్లోకి వెళ్తే.. రుచి (22) అనే యువ‌తికి రెండు నెల‌ల క్రితం ఒక వ్య‌క్తితో వివాహం జ‌రిగింది. ఇటీవ‌ల పంక్ష‌న్ నిమిత్తం త‌న బావ ఊరు అయిన ముజాహిద్‌పూర్‌కు వ‌చ్చింది. అయితే, బుధ‌వారం ఉద‌యం ఉన్న‌ట్టుండి రుచి క‌నిపించ‌కుండా పోయింది. 

ఊరంతా వెతికి చూడ‌గా ఊరిబ‌య‌ట చెట్టుకు ఓ యువ‌తి, యువ‌కుడి శ‌వాలు వేలాడుతూ క‌నిపించాయి. వారిలో ఒక‌రు రుచి కాగా, మ‌రొక‌రు ఓం సింగ్ (25) అనే యువ‌కుడు. అయితే, వారి ఆత్మ‌హ‌త్య‌కుగ‌ల కార‌ణం ఏమిట‌నే విష‌యంలో సస్పెన్స్ నెల‌కొన్న‌ది. గ్రామ‌స్తుల స‌మాచారం మేర‌కు ఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. మృత‌దేహాల‌ను పోస్టుమార్టానికి త‌ర‌లించారు. ఈ జంట ఆత్మ‌హ‌త్య‌ల‌పై కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.    

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo