ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Jun 29, 2020 , 17:10:08

పోలీసులపై కుక్కలను వదిలిన పీవీపీ

పోలీసులపై కుక్కలను వదిలిన పీవీపీ

 హైదరాబాద్‌ : ఒక కేసు విచారణ నిమిత్తం పలువురు పోలీసులు ప్రముఖ సినీ నిర్మాత ప్రసాద్‌ వి పొట్లూరి ఇంటికి వెళ్లగా.. ఆయన తన పెంపుడు కుక్కలను వారిమీదికి ఉసిగొల్పారు. కంగుతున్న పోలీసులు వెంటనే ఇంటి నుంచి బయటికి పరుగెత్తారు. విచారణకు వెళ్తే తమపై కుక్కలను వదిలారని ఎస్‌ఐ హరీశ్‌రెడ్డి ఫిర్యాదు చేయగా.. ఐపీసీ 353 కింద జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో పీవీపీపై కేసు నమోదైంది. 

గతవారం ఓ వ్యక్తి ఇంటి నిర్మాణాన్ని అడ్డుకొని దౌర్జన్యం చేస్తున్నారంటూ పీవీపీపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ మేరకు జూబ్లిహిల్స్‌ రోడ్‌ నెం.82లో ఉన్న పీవీపీ ఇంటికి వెళ్లగా, పోలీసులపై కుక్కలను వదిలిన ఘటన చోటుచేసుకుంది.

తాజావార్తలు


logo