సోమవారం 25 జనవరి 2021
Crime - Nov 08, 2020 , 18:00:55

స్పెల్లింగ్ మిస్‌టేక్‌తో కిల్ల‌ర్ ప‌ట్టివేత‌

స్పెల్లింగ్ మిస్‌టేక్‌తో కిల్ల‌ర్ ప‌ట్టివేత‌

ల‌క్నో : త‌న పేల‌వ‌మైన భాషా నైపుణ్యంతో జైలులో ప‌డ‌తాన‌ని ఓ వ్య‌క్తి ఎన్న‌డూ ఊహించి ఉండ‌డు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో చోటుచేసుకున్న ఘ‌ట‌న వివ‌రాలిలా ఉన్నాయి. రామ్ ప్ర‌తాప్ సింగ్ అనే వ్య‌క్తి గ‌డిచిన‌ అక్టోబ‌ర్ 26న‌ త‌న అమ్మ‌మ్మ ఇంటి స‌మీపంలో ఎనిమిదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ అనంత‌రం పిల్లాడిని హ‌త్య చేశాడు. కాగా అదే రోజు అతను దొంగిలించిన ఫోన్ నుండి బాలుడి తండ్రికి టెక్ట్స్ మేసేజ్ పంపాడు. బాలుడి విడుద‌లకు రూ .2 లక్షలు డిమాండ్ చేశాడు. టెక్ట్స్ మేసేజ్‌లో అత‌డు ఈ విధంగా రాశాడు. “Do lakh rupay Seeta-Pur lekar pahuchiye. Pulish ko nahi batana nahi to hatya kar denge.(రూ.2 ల‌క్ష‌లు తీసుకుని సీతాపూర్‌కు రండి. పోలీసుల‌కు చెబితే మీ కొడుకును చంపేస్తా) అని. దీంతో బాలుడు కుటుంబ స‌భ్యులు పోలీసులు ఆశ్ర‌యించి ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు బృందాల‌ను ఏర్పాటు చేశారు. 

నిందితుడు చేసిన నెంబ‌ర్‌కు ఫోన్ చేయ‌గా స్విచ్ఆఫ్ వ‌స్తోంది. సిమ్ కొనుగోలు చేసిన వ్య‌క్తిని పిలిచి విచారించ‌గా అప్ప‌టికే ఫోన్ పోయిన‌ట్లుగా తెలిపాడు. సీసీటీవీ కెమెరాల ఫుటేజీని ప‌రిశీలించి 10 మంది అనుమానితుల‌ను పోలీసులు విచార‌ణ‌కు పిలిచారు. వీరిలో రామ్ ప్ర‌తాప్‌సింగ్ కూడా ఉన్నాడు. నిందితులంద‌రిని పోలీసులు ఈ విధంగా రాయాల్సిందిగా సూచించారు. Main police main bharti hona chahta hoon. Main Hardoi se Sitapur daud kar ja sakta hoon(నాకు పోలీసు ఉద్యోగం కావాలి. హ‌ర్దోయి నుంచి సీతాపూర్‌కు నేను ప‌రుగెత్త‌గ‌ల‌ను) అని. ఇక్క‌డే రామ్ ప్ర‌తాప్ సింగ్ ప‌ప్పులో కాలేశాడు. police ని pulish గా అదేవిధంగా Sitapur ని Seeta-Pur గా రాసి అడ్డంగా దొరికిపోయాడు. అదుపులోకి తీసుకుని విచారించ‌గా నేరాన్ని అంగీక‌రించాడు. బాలుడిని తానే హ‌త్య చేసినట్లు ఒప్పుకున్నాడు. 


logo