మంగళవారం 11 ఆగస్టు 2020
Crime - Jul 06, 2020 , 08:14:23

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెజ్లింగ్ క్రీడాకారుడు ఆత్మహత్య

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెజ్లింగ్ క్రీడాకారుడు ఆత్మహత్య

రాజన్న సిరిసిల్ల : జాతీయ స్థాయి రెజ్లింగ్ క్రీడాకారుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బొప్పాపూర్‌ గ్రామానికి చెందిన జాతీయ స్థాయి రెజ్లింగ్ క్రీడాకారుడు భుజంకార్ శ్రీనివాస్ (24) ఆర్థిక ఇబ్బందులు, జీవితంలో స్థిరపడలేనని మనస్తాపంతో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

అతని మరణంలో కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు బొప్పాపూర్‌ చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo