బుధవారం 02 డిసెంబర్ 2020
Crime - Oct 08, 2020 , 15:16:47

మహీంద్రా ట్రాక్టర్ ప్లాంట్‌లో కార్మికుడు మృతి

మహీంద్రా ట్రాక్టర్ ప్లాంట్‌లో కార్మికుడు మృతి

సంగారెడ్డి : మహీంద్రా ట్రాక్టర్ ప్లాంట్‌లో పని చేస్తున్న ఓ కార్మికుడు ఆకస్మికంగా మరణించడంతో ఉద్రిక్తతలకు దారి తీసింది. జిల్లాలోని జహీరాబాద్ మండలం కాసింపూర్ గ్రామానికి చెందిన హుస్సేన్ (45) మహీంద్రా కర్మాగారంలో పని చేస్తూ ఆకస్మికంగా మృతి చెందాడు. కాగా, మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు మృత దేహంతో సర్కార్ దవాఖాన ముందు ఆందోళనకు దిగారు. న్యాయం చేసే వరకు ఆందోళన చేస్తామని గ్రామస్తులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.