మంగళవారం 26 మే 2020
Crime - May 23, 2020 , 19:31:59

లైంగిక వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

లైంగిక వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లైంగిక వేధింపులకు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్నది. పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని కరకవాగు గేట్‌ తండాకు చెందిన

పోలూరి రాజేశ్వరి అనే వివాహిత స్నానం చేస్తుండగా అదే ప్రాంతానికి చెందిన బానోత్‌ మధు అనే యువకుడు వీడియో తీశాడు. ఆ వీడియో చూపించి ఆమెను గత కొంతకాలంగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన రాజేశ్వరి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కొత్తగూడెం ఏరియా హాస్పిటల్‌కు తరలించగా, అక్కడ  చికిత్స పొందుతూ మరణించింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


logo