శనివారం 16 జనవరి 2021
Crime - Dec 27, 2020 , 11:33:20

పుట్టింటికి పంపలేదని పిల్లలతో సహా మహిళ ఆత్మహత్య

పుట్టింటికి పంపలేదని పిల్లలతో సహా మహిళ ఆత్మహత్య

హైదరాబాద్‌: నగరంలోని సికింద్రాబాద్‌లో విషాదం చోటుచేసుకున్నది. కుటుంబ కలహాలతో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో సహా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. సికింద్రాబాద్‌ పరిధిలోని జవహర్‌నగర్‌లో ఈ ఘటన జరిగింది. జవహర్‌నగర్‌కు చెందిన నాగమణి.. క్రిస్మస్‌ పండుగకు పుట్టింటికి వెళ్లడానికి ఆమె భర్త నిరాకరించాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె తన ఇద్దరు పిల్లలతో సహా చెన్నాపురం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నది. మృతిచెందిన చిన్నారుల్లో ఐదేండ్ల రూబీతోపాటు, ఎనిమిది నెలల చిన్నారి ఉన్నది. స్థానికులు సమాచారం అందిచడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.