ఆదివారం 17 జనవరి 2021
Crime - Dec 30, 2020 , 11:44:18

దుండిగల్‌లో మహిళను ఢీకొట్టిన ట్రక్‌

దుండిగల్‌లో మహిళను ఢీకొట్టిన ట్రక్‌

హైదరాబాద్‌: నగర శివార్లలోని దుండిగల్‌లో సిమెంటు రెడీ మిక్సర్‌ ట్రక్‌ కింద ఓ మహిళ నలిగిపోయింది. బుధవారం ఉదయం దుండిగల్‌లోని బాలానగర్-నర్సాపూర్ ప్రధాన రహదారిపై ఈ ఘటన జరిగింది. సుశీల అనే మహిళ ఓ ప్రైవేట్‌ దవాఖానలో పనిచేస్తున్నది. నైట్ డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో.. రోడ్డు దాటుతుండగా ఆమెను రెడ్ మిక్స్ లారీ ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడిక్కడే మృతిచెందింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.