లేడీ కానిస్టేబుల్‌పై ఇన్స్పెక్టర్ లైంగికదాడి.. సస్పెన్షన్

లక్నో : ఓ మహిళా పోలీస్ కానిస్టేబుల్‌పై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ సస్పెండయ్యాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అలీఘర్కు చెందిన రాకేశ్ యాదవ్ క్రైంబ్రాంచ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. అక్టోబర్ 29న ఓ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను తానున్న హోటల్ గదికి తీసుకురావల్సిందిగా ఓ మహిళా కానిస్టేబుల్‌కు ఆదేశించాడు. హోటల్ గదికి వెళ్లిన ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే పరిణామాలు దారుణంగా ఉంటాయని ఆమెను హెచ్చరించాడు. దీంతో ఆమె ఎవరికీ చెప్పకుండా ఉండిపోయింది. అయితే ఆమె భయాన్ని అలుసుగా తీసుకున్న రాకేశ్ యాదవ్.. ఆమెకు ఫోన్ చేస్తూ అసభ్యంగా మాట్లాడేవాడు. దాంతో సహనం కోల్పోయిన ఆమె జిల్లా ఎస్పీని ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న ఇన్స్పెక్టర్ రాకేశ్ యాదవ్ కోసం గాలిస్తున్నారు. కాగా, మహిళా కానిస్టేబుల్‌పై లైంగికదాడికి పాల్పడిన ఇన్స్పెక్టర్పై శాఖాపరమైన చర్యలు తీసుకున్న ఎస్సీ.. రాకేశ్‌యాదవ్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- విద్యాలయాల ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలి
- పోలీస్ గ్రీవెన్స్‌కు ఆరు ఫిర్యాదులు
- ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిని కలిసిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల
- ప్రమాద రహిత జిల్లాగా మార్చాలి : ఎస్పీ చేతన
- కొవిడ్ వ్యాక్సిన్‌పై భయం వద్దు
- ఆన్లైన్లో యోగా
- రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో ఐదు మెడల్స్
- జాగ్రత్తలు పాటించాలి
- షిఫ్టులుండవ్
- భక్తి సు‘గంధం’