e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home క్రైమ్‌ మహిళ ఆత్మహత్య.. అత్త వారింటికి నిప్పు

మహిళ ఆత్మహత్య.. అత్త వారింటికి నిప్పు

మహిళ ఆత్మహత్య.. అత్త వారింటికి నిప్పు

శ్రీనగర్‌: ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆగ్రహించిన ఆమె కుటుంబ సభ్యులు అత్త వారింటికి నిప్పుపెట్టారు. జమ్ము కశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పెండ్లి జరిగి ఏడు ఏండ్లైన ఒక మహిళ భర్త వేధింపులు భరించలేక శనివారం ఆత్మహత్య చేసుకున్నది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు అత్త వారింటికి వచ్చారు. మహిళ మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించిన అనంతరం ఆగ్రహంతో ఆ ఇంటికి నిప్పుపెట్టారు.

మరోవైపు పోలీసులు ఇరు కుటుంబాల ఫిర్యాదుల ఆధారంగా ఇరు వర్గాలపై కేసు నమోదు చేశారు. భార్యను వేధించి ఆమె మరణానికి కారణమైన భర్తను అరెస్ట్ చేశారు. అలాగే అత్త వారి ఇంటికి నిప్పుపెట్టిన మహిళ సోదరుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు పాల్పడిన ఇతర కుటుంబ సభ్యులను గుర్తించే పనిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
మహిళ ఆత్మహత్య.. అత్త వారింటికి నిప్పు
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement