బుధవారం 12 ఆగస్టు 2020
Crime - Jul 02, 2020 , 20:27:20

భ‌ర్త‌తో వివాదం.. విద్యుత్ తీగ‌ల‌ను ప‌ట్టుకున్న భార్య‌

భ‌ర్త‌తో వివాదం.. విద్యుత్ తీగ‌ల‌ను ప‌ట్టుకున్న భార్య‌

నిజామాబాద్ : జిల్లాలోని వ‌ర్ని మండ‌లం జ‌కోరా గ్రామంలో విషాదం నెల‌కొంది. భ‌ర్త‌తో గొడ‌వ ప‌డ్డ భార్య‌.. క్ష‌ణికావేశంలో విద్యుత్ తీగ‌ల‌ను ప‌ట్టుకున్న‌ది. దీంతో ఆమె అక్క‌డిక‌క్కడ ప్రాణాలు కోల్పోయింది. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు మ‌హిళ మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలిని అర్స‌ప‌ల్లి ల‌క్ష్మి(45)గా గుర్తించారు.

అయితే బుధ‌వారం రాత్రి కూడా భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య వివాదం చోటు చేసుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు. గురువారం ఉద‌యం కూడా మ‌ళ్లీ గొడ‌వ చోటు చేసుకోవ‌డంతో.. తాను చ‌నిపోతున్నాన‌ని చెప్పి.. ల‌క్ష్మి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఊరి చివ‌ర‌న ఉన్న ట్రాన్స్ ఫార్మ‌ర్ తీగ‌ల‌ను ఆమె ప‌ట్టుకోవ‌డంతో ప్రాణాలు కోల్పోయింద‌ని వ‌ర్ని ఎస్ఐ అనిల్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. 


logo