సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Aug 06, 2020 , 17:28:07

పెళ్లిపై అయిష్టత.. మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య

పెళ్లిపై అయిష్టత.. మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య

హైదరాబాద్‌ : పెండ్లి చేసుకోవడం ఇష్టంలేని ఓ మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన నగరంలోని ఎల్‌బీ నగర్‌ పరిధి మన్సురాబాద్‌లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. మృతురాలిని లక్ష్మీ(27)గా గుర్తించారు. మదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. అమ్మ, పెద్ద తమ్ముడితో కలిసి ఉంటోంది. ఇంట్లో వాళ్లు పెండ్లి సంబంధాలు చూస్తున్నప్పటికీ ఆమె వాటిని తిరస్కరిస్తూ వస్తుంది. బుధవారం సైతం సంబంధం విషయమై ఓ అబ్బాయిని చూసేందుకు వెళ్లారు.

ఈ సమయంలో లక్ష్మీ ఆత్మహత్య చేసుకుంది. తల్లి, కొడుకు రాత్రి ఇంటికి వచ్చి చూసేసరికి సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయింది. సంఘటనా స్థలంలో ఎటువంటి ఆత్మహత్య లేఖ లభించలేదని పోలీసులు తెలిపారు. పెండ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పినప్పటికీ ఇంట్లో వాళ్లు సంబంధాలు చూడటంతో ఇలా చేసుకుని ఉండొచ్చని పోలీసులు పేర్కొన్నారు. ఎల్‌బీ నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.


logo