మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Jul 04, 2020 , 17:25:17

గోదావరిలో దూకి మహిళ ఆత్మహత్య

గోదావరిలో దూకి మహిళ ఆత్మహత్య

మంచిర్యాల : గోదావరి నదిలో దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. లత(21), భరత్‌(23) ఇరువురు దంపతులు. రెండేళ్లక్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. రామగుండంలో జీవనం కొనసాగిస్తున్నారు. నాలుగు రోజులక్రితం తల్లిగారింటికి మంచిర్యాలకు వచ్చింది. రెండు రోజులక్రితం పుట్టింటి నుంచి భర్త వద్దకు రామగుండంకు బయల్దేరింది. కాగా ఇంటినుంచి బయల్దేరేముందు తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు తన సెల్‌ఫోన్‌లో సెల్ఫీ వీడియో తీసుకుంది. సెల్‌ఫోన్‌ను తల్లి ఇంట్లోనే వదిలిపెట్టింది. అక్కడినుంచి బయల్దేరి గోదావరి బ్రిడ్జి వద్దకు వచ్చి బ్రిడ్జి పైనుంచి గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 


logo