గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Jul 14, 2020 , 15:04:41

మ‌హిళ‌ను తీవ్రంగా చిత‌క‌బాది.. న‌గ్నంగా ఊరేగించారు

మ‌హిళ‌ను తీవ్రంగా చిత‌క‌బాది.. న‌గ్నంగా ఊరేగించారు

పాట్నా : ఓ మ‌హిళ‌ను తీవ్రంగా చిత‌క‌బాదారు.. న‌డిరోడ్డుపై ఈడ్చుకెళ్లారు. అంత‌టితో ఆగ‌కుండా ఆమెను న‌గ్నంగా ఊరేగించారు. ఈ ఘ‌ట‌న బీహార్ లోని ముజ‌ఫ‌ర్ న‌గ‌ర్ జిల్లాలో చోటు చేసుకుంది. 

అంధ‌ర‌ధారిలో నివ‌సిస్తున్న ఓ మ‌హిళకు అంగ‌న్ వాడీ కార్య‌క‌ర్త లీలాదేవీ, భ‌ర్త మోతీ మ‌హాతో వివాదం ఉంది. ఈ క్ర‌మంలో బాధిత మ‌హిళ.. లీలా దేవీ దంప‌తుల‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డాన్ని మోతీ మ‌హో జీర్ణించుకోలేక‌పోయాడు. దీంతో ఫిర్యాదు చేసిన మ‌హిళ ఇంటికెళ్లి.. ఆమెను ఇంటి నుంచి బ‌య‌ట‌కు లాక్కొచ్చారు. న‌డిరోడ్డుపై తీవ్రంగా చిత‌క‌బాదారు. ఆమెను న‌గ్నంగా ఊరేగించారు.

త‌న‌కు జ‌రిగిన ఘోర అవ‌మానాన్ని భ‌రించ‌లేక‌.. బాధితురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మ‌హిళ‌ను ఊరేగించిన వీడియోలు వైర‌ల్ అయ్యాయి. ఈ ఘ‌ట‌న‌లో 13 మంది పాలుపంచుకున్న‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. 


logo