e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home News అభ్యంత‌ర‌క‌ర వీడియోతో బ్లాక్ మెయిలింగ్ : మ‌హిళా టెకీ అరెస్ట్

అభ్యంత‌ర‌క‌ర వీడియోతో బ్లాక్ మెయిలింగ్ : మ‌హిళా టెకీ అరెస్ట్

అభ్యంత‌ర‌క‌ర వీడియోతో బ్లాక్ మెయిలింగ్ : మ‌హిళా టెకీ అరెస్ట్

న్యూఢిల్లీ : అభ్యంత‌ర‌క‌ర వీడియో రూపొందించి వ్యాపారిని రూ కోటి ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్‌కు పాల్ప‌డిన 29 ఏండ్ల మ‌హిళా సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ స‌హా ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. త‌మ‌కు రూ కోటి ఇవ్వ‌కుంటే వీడియోను ఇంట‌ర్‌నెట్‌లో అప్‌లోడ్ చేస్తామ‌ని నిందితులు వ్యాపారిని బెదిరించారు. నిందితుల‌ను రాజ్ కిషోర్ సింగ్ (31) ఆర్య‌న్ దీక్షిత్ (28), పాయ‌ల్ (29)గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం రాజ్ కిషోర్ ఈ రాకెట్‌కు ప్ర‌ధాన సూత్ర‌ధారి కాగా పాయ‌ల్‌తో క‌లిసి అత‌ను వ్యాపారిని వ‌ల‌లో వేసుకోవాల‌ని ప్లాన్ చేశాడు.

రాజ్ కిషోర్ గుర్‌గావ్‌లో స్పా ఏర్పాటు చేసి దానిమాటున యువ‌తుల‌తో వ్య‌భిచారానికి తెర‌లేపాడు. సంపన్న వ్యాపార వేత్త‌ల‌ను హ‌నీట్రాప్‌కు గురిచేసి అందిన‌కాడికి దోచేయాల‌ని స్కెచ్ వేసేవాడు. ఈ క్ర‌మంలో పాయ‌ల్‌, దీక్షిత్‌తో క‌లిసి ఢిల్లీ వ్యాపారిని టార్గెట్ చేశారు. నిందితులు ఆన్‌లైన్‌లో పాయ‌ల్‌తో వ్యాపారిని చాట్ చేసేలా వ‌ల ప‌న్నారు. పాయ‌ల్ స్పై కెమెరాతో బాధితుడి ఫోటోలు, వీడియో రికార్డు చేస్తుండ‌టంతో నిందితులు వీటిని చూపి బాధితుల నుంచి డ‌బ్బు గుంజేవారు. తాజా ఘ‌ట‌న‌లో బాధిత వ్యాపారి పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో మ‌హిళా టెకీ స‌హా ఇద్ద‌రు నిందితుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అభ్యంత‌ర‌క‌ర వీడియోతో బ్లాక్ మెయిలింగ్ : మ‌హిళా టెకీ అరెస్ట్
అభ్యంత‌ర‌క‌ర వీడియోతో బ్లాక్ మెయిలింగ్ : మ‌హిళా టెకీ అరెస్ట్
అభ్యంత‌ర‌క‌ర వీడియోతో బ్లాక్ మెయిలింగ్ : మ‌హిళా టెకీ అరెస్ట్

ట్రెండింగ్‌

Advertisement