సోమవారం 03 ఆగస్టు 2020
Crime - Jul 08, 2020 , 16:16:05

మ‌ద్యం మ‌త్తులో భ‌ర్త‌.. గొంతు కోసిన భార్య‌

మ‌ద్యం మ‌త్తులో భ‌ర్త‌.. గొంతు కోసిన భార్య‌

కుమ్రంభీం ఆసిఫాబాద్ : కుటుంబ వివాదాల కార‌ణంగా ఓ భార్య‌.. త‌న భ‌ర్త గొంతు కోసి చంపింది. ఈ ఘ‌ట‌న జిల్లాలోని రెబ్బెన మండ‌లంలోని రోళ్ల‌పహాడ్ గ్రామంలో చోటు చేసుకుంది. రోళ్ల‌ప‌హాడ్ గ్రామానికి చెందిన శ్రీనివాస్(42), స్వ‌ప్న దంప‌తులు. వీరికి ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. అయితే స్వ‌ప్న‌తో శ్రీనివాస్ గొడ‌వ ప‌డ్డాడు. ఈ గొడ‌వ ప్రాణాల‌ను తీసేదాకా తెచ్చింది.

గొడ‌వ ప‌డ్డ రోజే భ‌ర్త మ‌ద్యం సేవించాడు. మ‌ద్యం మ‌త్తులో ఉన్న భ‌ర్త గాఢ‌నిద్ర‌లోకి జారుకున్నాడు. దీంతో భ‌ర్త గొంతు కోసి చంపేసింది భార్య‌. రెబ్బెన ఎస్ఐ డీ ర‌మేశ్ ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని ప‌రిశీలించారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo