ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Jul 08, 2020 , 17:44:11

ఎస్ఐ చెంపపై కొట్టిన మ‌హిళ‌

ఎస్ఐ చెంపపై కొట్టిన మ‌హిళ‌

చెన్నై : ఓ వివాదాన్ని ప‌రిష్క‌రించేందుకు ఎస్ఐతో పాటు కానిస్టేబుల్ ఓ గ్రామానికి వెళ్లారు. అక్క‌డ ఎస్ఐ చెంప‌పై ఓ మ‌హిళ కొట్టింది. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడు విల్లుపురంలోని అనాథూర్ గ్రామంలో శ‌నివారం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. 

అనాథూర్ గ్రామానికి చెందిన ముత్తురామ‌న్ త‌న భార్య సార‌థి, ఇద్ద‌రు పిల్ల‌లతో క‌లిసి ఉంటున్నాడు. ముత్తురామ‌న్ వృత్తిరీత్యా వ్య‌వ‌సాయ‌దారుడు. అయితే ఈ కుటుంబానికి ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న ప‌థ‌కం కింద ఇల్లును మంజూరు చేశారు. ఈ ఇండ్ల నిర్మాణాన్ని బ్లాక్ డెవ‌ల‌ప్ మెంట్ కార్యాల‌యం.. ప్ర‌యివేటు కాంట్రాక్ట‌ర్ సుభాష్ చంద్ర‌బోస్ కు అప్ప‌గించారు. అయితే గృహ నిర్మాణం జ‌రుగుతున్న స‌మ‌యంలో ముత్తురామ‌న్ వ‌ద్ద డ‌బ్బులు తీసుకుని కాంట్రాక్ట‌ర్ మోస‌గించాడు. ఇదే విష‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు చోటు చేసుకున్నాయి. ఆ త‌ర్వాత పోలీసుల దాకా వెళ్లింది. 

ఈ క్ర‌మంలో తిరువ‌న్నైలూరు పోలీసులు అనాథూర్ గ్రామానికి శ‌నివారం చేరుకున్నారు. ఎస్ఐతో పాటు కానిస్టేబుల్ ముత్తురామ‌న్ ఇంటికెళ్లారు. అప్ప‌టికే మ‌ద్యం మ‌త్తులో ఉన్న ముత్తుపై ఎస్ఐ దాడి చేశాడు. దీంతో ఆవేశంతో ఊగిపోయిన సార‌థి.. ఎస్ఐ చెంప‌పై కొట్టింది. ముత్తురామ‌న్.. ఎస్ఐ బైక్ కీని, కానిస్టేబుల్ ఫోన్ ను లాక్కున్నాడు. గ్రామ‌స్తులంతా ఏక‌మై.. గ్రామాన్ని విడిచిపోవాల‌ని పోలీసుల‌ను డిమాండ్ చేశారు.

మొత్తానికి పోలీసు ఉన్న‌తాధికారులు అనాథూర్ గ్రామానికి చేరుకుని గ్రామ‌స్తుల‌కు న‌చ్చ‌జెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo