మంగళవారం 01 డిసెంబర్ 2020
Crime - Oct 27, 2020 , 12:29:05

కారు ఎక్క‌లేద‌ని యువ‌తిని కాల్చిచంపాడు!

కారు ఎక్క‌లేద‌ని యువ‌తిని కాల్చిచంపాడు!

న్యూఢిల్లీ: హ‌ర్యానా రాష్ట్రం వ‌ల్ల‌భ్‌గ‌ఢ్ జిల్లాలో దారుణం జ‌రిగింది. త‌న కారు ఎక్కుమంటే ఎక్క‌లేద‌ని ఓ వ్య‌క్తి ఓ యువ‌తిని కాల్చిచంపాడు. ప‌ట్ట‌ప‌గ‌లు న‌డిరోడ్డు మీద అంద‌రూ చూస్తుండ‌గానే ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే సోమ‌వారం సాయంత్రం వ‌ల్ల‌భ‌గ‌ఢ్‌కు చెందిన నిఖిత అనే యువ‌తి కాలేజీలో ప‌రీక్ష రాసేందుకు బ‌య‌లుదేరింది. ఆమె రోడ్డుపై న‌డుచుకుంటూ వెళ్తుండ‌గా తౌసీఫ్ అనే వ్య‌క్తి కారులో ఆమెను వెంబ‌డించి కారు ఎక్కాల‌న్నాడు. అయితే, తౌసీఫ్ గ‌త కొంత కాలంగా త‌న వెంటప‌డి వేధిస్తుండ‌టంతో కారు ఎక్కేందుకు ఆమె నిరాక‌రించింది. దీంతో ఆగ్ర‌హానికి లోనైన తౌసీఫ్ ఆమెను తుపాకీతో కాల్చి పారిపోయాడు. 

మృతురాలు తండ్రి ఫిర్యాదు మేర‌కు పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. కాగా, తౌసీఫ్‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని, బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాల‌ని మృతురాలి బంధ‌వులు, స్నేహితులు పోలీస్ స్టేష‌న్ ఎదుట ధ‌ర్నాకు దిగారు. కాగా, నిందితులు త‌న కూతురును వేధిస్తున్నార‌ని గ‌తంలో కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాన‌ని, కానీ పోలీసులు స‌రిగా స్పందించ‌క‌పోవ‌డంతో ఇప్పుడు వాళ్లు నా కూతురును చంపేశారని మృతురాలు తండ్రి విల‌పించారు.      

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.