మంగళవారం 11 ఆగస్టు 2020
Crime - Jul 12, 2020 , 13:06:37

బహిరంగంగా మహిళపై లైంగిక వేధింపులు.. వ్యక్తి అరెస్ట్‌

బహిరంగంగా మహిళపై లైంగిక వేధింపులు.. వ్యక్తి అరెస్ట్‌

అబుదాబి : దుబాయ్‌లో మహిళలపై నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గత రెండు వారాల్లో అధిక సంఖ్యలో వేధింపులు, లైంగిక దాడుల కేసులు నమోదైనట్లు కోర్టు అధికారులు తెలియజేశారు. తాజాగా దుబాయ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్‌లో అలాంటి ఒక కేసు వచ్చింది. వివరాల ప్రకారం.. ఒక నేపాలీ మహిళ జెబెల్ అలీలో ఉన్న తన ఇంటికి వెళ్తుండగా ఒక వ్యక్తి నడి వీధిలో మహిళను ఆపి అసభ్యకరంగా ప్రవర్తించి, లైంగికంగా వేధించాడు. దీంతో ఆ మహిళ కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి వచ్చి వ్యక్తిని చెదరగొట్టడంతో అక్కడి నుంచి పారిపోయాడు. మహిళ ఫిర్యాదు మేరకు వ్యక్తిని అరెస్టు చేసి కొర్టుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కేసు తదుపరి విచారణ జూలై 27 న జరగాల్సి ఉన్నట్లు న్యాయస్థానం పేర్కొంది. 


logo