ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Crime - Jul 26, 2020 , 20:20:05

వ్యభిచారం నడుపుతున్న మహిళ.. అరెస్టు చేసిన పోలీసులు

వ్యభిచారం నడుపుతున్న మహిళ.. అరెస్టు చేసిన పోలీసులు

  • సెక్స్‌ రాకెట్‌ ఛేదన.. 8 మంది యువతులు, ఏడుగురు వ్యక్తులు అరెస్టు

ఘజియాబాద్‌ : ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ర్టం ఘజియాబాద్‌ జిల్లా సాహిబాబాద్‌లోని షాలిమార్ గార్డెన్ ప్రాంతంలో ఉన్న ఒక ఇంటిపై దాడి చేసి పోలీసులు సెక్స్ రాకెట్‌ను ఛేదించారు. ఇందులో 8 మంది మహిళలు, ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. 

పోలీసుల వివరాలు.. ఇక్కడ నివసిస్తున్న ఒక మహిళ దూర ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి వారిని సుందరంగా తయారు చేసి ఢిల్లీ సహా ఇతర ప్రాంతాలకు పంపేది. ఈ వ్యభిచారం చాలా కాలం నుంచి జరుగుతుంది. వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా సెక్స్ రాకెట్‌ను మహిళ నడిపేది. ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి షాలిమార్ గార్డెన్ ప్రాంతంలో గల కాంప్లెక్స్ ఫ్లాట్‌లో ఉంచేది. కస్టమర్లు యువతుల కోసం ఇక్కడి వచ్చేవారు. చాలా మంది యువతులు స్వతహాగా సెక్స్‌ వ్యాపారం కోసం ఇక్కడికి వచ్చేవారని తెలిసింది. 


సాహిబాబాద్‌ సిఐ మహీపాల్ సింగ్ మాట్లాడుతూ షాలిమార్ గార్డెన్‌లోని ఒక ఫ్లాట్‌లో యువతులను తీసుకొచ్చి వ్యభిచారం చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు సిబ్బందితో దాడులు జరిపామని, ఈ దాడుల్లో 8 మంది యువతులతో పాటు ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేశామన్నారు. ఈ సెక్స్ రాకెట్‌ మొత్తాన్ని ఒక మహిళ నడుపుతోందని సీఐ పేర్కొన్నారు. 

తన భర్త చాలా కాలం క్రితం చనిపోయాడని, తన పిల్లల విద్య, కుటుంబాన్ని పోషించడం కోసం బలవంతంగా ఈ వ్యాపారంలోకి రావాల్సి వచ్చిందని పోలీసుల విచారణలో ఆ మహిళ తెలిపింది. అనంతరం వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo