ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Crime - Jun 19, 2020 , 09:13:28

క‌దులుతున్న బ‌స్సులో అత్యాచారం.. ఆరిస్తే చంపేస్తామ‌ని బెదిరింపు

క‌దులుతున్న బ‌స్సులో అత్యాచారం.. ఆరిస్తే చంపేస్తామ‌ని బెదిరింపు

నోయిడా : క‌దులుతున్న బ‌స్సులో ఓ వివాహిత‌పై అత్యాచారం జ‌రిగింది. ఈ దారుణ ఘట‌న ల‌క్నో - మ‌థుర ర‌హ‌దారిపై బుధ‌వారం తెల్ల‌వారుజామున చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. 

ప్ర‌తాప్‌ఘ‌ర్ కు చెందిన ఓ వివాహిత త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి ఏసీ స్లీప‌ర్ బ‌స్సులో బుధ‌వారం రాత్రి నోయిడాకు బ‌య‌ల్దేరింది. తెల్ల‌వారుజామున 2 గంట‌ల స‌మ‌యంలో వెనుక సీట్లో కూర్చున్న ఆమెపై న‌లుగురు వ్య‌క్తులు అత్యాచారం చేశారు. ఆ స‌మ‌యంలో బ‌స్సులో ఇత‌ర ప్ర‌యాణికులు కూడా ఉన్నారు. దీంతో ఆరిస్తే చంపేస్తామ‌ని బాధిత మ‌హిళ‌ను బెదిరించారు. చేసేదీమీ లేక బాధితురాలు అలానే ఉండిపోయింది. ఇష్ట‌మొచ్చిన‌ట్లు మ‌హిళ‌పై దుండ‌గులు ప్ర‌వ‌ర్తించారు. ఈ దారుణానికి పాల్ప‌డిన వారిలో ఇద్ద‌రు డ్రైవ‌ర్ల‌తో పాటు మ‌రో ఇద్ద‌రు ఉన్నారు.

మొత్తానికి బ‌స్సు దిగిన త‌ర్వాత బాధితురాలు గౌత‌మ్ బుద్ధ‌న‌గ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. బ‌స్సు నంబ‌ర్ ఆధారంగా.. డ్రైవ‌ర్ తో పాటు ఒక‌రిని అదుపులోకి తీసుకున్నారు. మ‌రో ఇద్ద‌రి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధితురాలి భ‌ర్త‌.. నోయిడాలో కూర‌గాయ‌ల వ్యాపారం చేస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు.


logo