మంగళవారం 20 అక్టోబర్ 2020
Crime - Sep 20, 2020 , 12:05:41

వివాహితపై లైంగిక దాడి.. యువకుడి అరెస్టు

వివాహితపై లైంగిక దాడి.. యువకుడి అరెస్టు

గొండా : ఉత్తర ప్రదేశ్‌లోని గోండా జిల్లాలో వివాహితపై యువకుడు లైంగిక దాడి చేశాడు. ఖోండారే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖోండారే సమీప గ్రామానికి చెందిన వివాహిత ఇటీవల తన పుట్టింటికి వెళ్లింది. శుక్రవారం సాయంత్రం అత్తవారింటికి పిల్లలను వెంటబెట్టుకొని బయల్దేరింది. మార్గమధ్యలో ఆమెను అడ్డుకున్న యువకుడు సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి లాకెళ్లి లైంగిక దాడి చేశాడు. బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు గోండా పోలీస్ సూపరింటెండెంట్ శైలేశ్‌ కుమార్ పాండే తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్ష నిమిత్తం పంపినట్లు చెప్పారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo