బుధవారం 25 నవంబర్ 2020
Crime - Oct 29, 2020 , 12:18:28

హాస్పిటల్‌లో మహిళపై లైంగిక దాడి!

హాస్పిటల్‌లో మహిళపై లైంగిక దాడి!

గుర్గావ్ : ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్‌కు వెళ్లిన మహిళపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. 21 ఏళ్ల మహిళ వారం రోజుల కిందట క్షయ వ్యాధితో బాధపడుతూ గుర్గావ్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చేరింది. ఆమెను ఐసీయూకు తరలించి చికిత్స చేశారు. సదరు మహిళ స్పృహలోకి లేకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆరు రోజుల తర్వాత సదరు మహిళ స్పృహలోకి రావడంతో.. సంజ్ఞల ద్వారా విషయాన్ని కుటుంబీకులకు తెలిపింది. దీంతో బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సుశాంత్‌ లోక్‌ పోలీస్‌స్టేషన్‌లో దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ మేరకు.. బాధిత మహిళ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడంతో ఈ నెల 21న బాధిత మహిళను కుటుంబీకులు ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చేర్పించగా.. వెంటిలెటర్‌పై ఉంచి చికిత్స అందించారు.

ఈ క్రమంలో సదరు మహిళపై లైంగిక దాడి చేసినట్లు ఆమె తండ్రి పోలీసులకు తెలిపారు. ఆమెకు ప్రభుత్వ హాస్పిటల్‌కు పరీక్షలు చేయాలని కుటుంబం కోరింది. ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేసేందుకు పోలీసులు హాస్పిటల్‌కు వెళ్లగా.. ఆమె మాట్లాడే పరిస్థితి లేదని వైద్యులు తెలిపారు. కేసును పరిశీలిస్తున్నామని, బాధితురాలి నుంచి స్టేట్‌మెంట్‌ తీసుకున్నాక స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు. ఆధారాల కోసం హాస్పిటల్‌ నుంచి సీసీటీవీ ఫుటేజ్‌ను సేకరించి పరిశీలిస్తున్నామని పోలీస్‌ అధికారి మక్సూద్‌ అహ్మద్‌ చెప్పారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.