మంగళవారం 01 డిసెంబర్ 2020
Crime - Oct 28, 2020 , 19:17:53

వికారాబాద్‌లో దారుణం.. మ‌హిళ గొంతుకోసి హ‌త్య

వికారాబాద్‌లో దారుణం.. మ‌హిళ గొంతుకోసి హ‌త్య

వికారాబాద్ : గుర్తుతెలియని దుండ‌గులు ఓ మ‌హిళ గొంతుకోసి దారుణంగా హ‌త‌మార్చారు. ఈ విషాద సంఘ‌ట‌న వికారాబాద్ జిల్లా పూడూర్ మండ‌లం రాకంచ‌ర్ల ఇండ‌స్ర్టియ‌ల్ కారిడార్ స‌మీపంలో చోటుచేసుకుంది. ప్రధాన రహదారి కల్వర్టు పక్కన నీటి గుంతలో వివాహిత‌ మ‌హిళ మృతదేహం లభ్యమైంది. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది. స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని విచార‌ణ చేప‌ట్టారు.