బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Sep 09, 2020 , 20:14:35

సహజీవనం చేసిన వ్యక్తే చంపేశాడు

సహజీవనం చేసిన వ్యక్తే చంపేశాడు

హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌లో చోటుచేసుకున్న మహిళ హత్య కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. సహజీవనం చేస్తున్న వ్యక్తే హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సికింద్రాబాద్‌ మార్కెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రహదారి పక్కన ఓ మహిళ అనుమానాస్పదంగా మృతిచెంది పడిఉంది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు మృతురాలిని భాగ్యలక్ష్మి(30)గా గుర్తించారు. ఆదివారం రాత్రే హత్య చేసి సోమవారం రాత్రి ఆర్పీ రోడ్డులో పడేసినట్లు వెల్లడించారు. తనతో సహజీవనం చేసిన వ్యక్తే మహిళను హత్య చేసినట్లు పేర్కొన్నారు.


logo