మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Crime - Jun 26, 2020 , 15:42:39

మూడేళ్ల కుమార్తెను చంపి.. త‌ల్లి ఆత్మ‌హ‌త్య‌

మూడేళ్ల కుమార్తెను చంపి.. త‌ల్లి ఆత్మ‌హ‌త్య‌

ముంబై : నిరుపేద‌ల‌కు లాక్ డౌన్ ఎన్నో క‌ష్టాలు తెచ్చిపెట్టింది. ఉపాధి లేక‌పోవ‌డంతో.. బ‌త‌క‌డం భారంగా మారింది. ఓ త‌ల్లి పిల్ల‌ల‌ను పోషించ‌డానికి ఇబ్బందిగా మార‌డంతో.. త‌న మూడేళ్ల కుమార్తెను చంపి ఆ త‌ర్వాత ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ విషాద ఘ‌ట‌న మ‌హారాష్ర్ట పాల్గ‌ర్ జిల్లాలోని జ‌వ‌హ‌ర్ తాలుకా ప‌రిధిలో జూన్ 22న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. 

గిరిజ‌న క‌మ్యూనిటీకి చెందిన ఓ వ్య‌క్తికి భార్య‌, ఇద్ద‌రు ఆడ పిల్ల‌లు ఉన్నారు. లాక్ డౌన్ కార‌ణంగా.. వారికి ఉపాధి కరువైంది. గ‌త మూడు నెల‌ల నుంచి ప‌నులు లేక‌పోవ‌డంతో.. పోష‌ణ క‌ష్టంగా మారింది. దీంతో త‌న ఏడేళ్ల కూతురిని ఇంటి వ‌ద్దే ఉంచి.. మూడేళ్ల కుమార్తెతో క‌లిసి స‌మీప అడ‌విలోకి వెళ్లింది. 

చిన్నారిని చంపి తాను ఆత్మ‌హ‌త్య చేసుకుంది. అయితే గ్రామ‌స్తులు.. క‌ల‌ప కోసం అడ‌విలోకి వెళ్ల‌గా వీరిద్ద‌రి మృత‌దేహాలు ల‌భ్య‌మ‌య్యాయి. 22వ తేదీ నుంచే భ‌ర్త కూడా భార్యాబిడ్డ‌ల ఆచూకీ కోసం గాలిస్తున్నాడు. ఇద్ద‌రి మృత‌దేహాల‌ను చూసి భ‌ర్త బోరున విల‌పించాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


logo