శనివారం 24 అక్టోబర్ 2020
Crime - Sep 23, 2020 , 11:32:05

భ‌ర్త‌ను చంపి.. మంచంలో దాచి..

భ‌ర్త‌ను చంపి.. మంచంలో దాచి..

జైపూర్‌: త‌ర‌చూ త‌న‌తో గొడ‌వ ప‌డుతుండ‌టంతో భ‌ర్త‌ను చంపేసింది. విష‌యం బ‌య‌ట ప‌డొద్ద‌ని మృత‌దేహాన్ని ఇంట్లో దాచిపెట్టింది. దుర్వాస‌న వ‌స్తుండ‌టంతో పోలీసుల‌కు స‌మాచారం అందించింది. ఈ ఘ‌ట‌న రాజ‌స్థాన్‌లోని చురూ జిల్లాలో జ‌రిగింది. 

చురూ జిల్లాలోని హ‌‌మిర్వాస్‌కు చెందిన నీర‌జ, నిర్మ‌ల్ సింగ్ భార్యా భ‌ర్త‌లు. ఇద్ద‌రు త‌ర‌చూ గొడ‌వ ప‌డేవారు. భరించ‌లేని భార్య ఆదివారం రాత్రి త‌న భ‌ర్త‌ను చంపేసింది. అయితే విష‌యం బ‌య‌ట‌కు తెలియ‌కుండా భ‌ర్త‌ శ‌వాన్ని మంచంలో దాచిపెట్టింది. సోమ‌వారం సాయంత్రానికి ఇల్లంతా దుర్వాస‌నతో నిండిపోయింది. దీంతో అస‌లు విష‌యాన్ని పోలీసుల‌కు చెప్పింది. దీంతో ఘ‌టనా స్థ‌లానికి చేరిన పోలీసులు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

పోస్టుమార్టం నిమిత్తం ద‌వాఖాన‌కు త‌లించామ‌ని స్టేష‌న్ హౌస్ ఆఫీస‌ర్ హ‌మిర్వాస్ సుభాష్ చంద్ర తెలిపారు. ఆమెపై కేసు న‌మోదు చేశామ‌ని, ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు. నిర్మ‌ల్ సింగ్ హ‌త్య‌కు సంబంధించిన వివ‌రాలు ఇంకా తెలియ‌వ‌ని, అయితే ఇద్ద‌రూ త‌రుచూ గొడ‌వ‌ప‌డేవార‌ని చెప్పారు.    


logo