బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Sep 17, 2020 , 13:25:28

మ‌రో పెండ్లి చేసుకున్న భ‌ర్త‌.. కూతు‌రుతో స‌హ మ‌హిళ ఆత్మ‌హ‌త్య‌

మ‌రో పెండ్లి చేసుకున్న భ‌ర్త‌.. కూతు‌రుతో స‌హ మ‌హిళ ఆత్మ‌హ‌త్య‌

ల‌క్నో : క‌ట్టుకున్న భ‌ర్త మ‌రో మ‌హిళ‌ను పెండ్లి చేసుకోవ‌డంతో మ‌న‌స్తాపం చెందిన ఓ మ‌హిళ త‌న‌ కూతురుతో స‌హా ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ విషాద సంఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బంద జిల్లా చిల్లా ప్రాంతంలో చోటుచేసుకుంది. మంగ‌ళ‌వారం రాత్రి జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ర‌జిని(28) అనే మ‌హిళ‌ మొద‌ట‌గా త‌న రెండేళ్ల కూతురు షాలిని(2)ని చంపింది. అనంత‌రం తాను సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. భ‌ర్త శివ‌దాస్ మ‌రో మ‌హిళ‌ను పెండ్లి చేసుకోవ‌డ‌మే ఇందుకు కార‌ణంగా గ్రామ‌స్తులు తెలిపార‌న్నారు. ఇదే అంశంపై ఇరువురు త‌ర‌చుగా గొడ‌వ ‌ప‌డుతుండేవారన్నారు. జ‌రిగిన ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. నిందితుడి అదుపులోకి తీసుకుని విచారించ‌డం, పోస్టుమార్టం నివేదిక అనంత‌రం మాత్ర‌మే మృతికి గ‌ల కార‌ణాలను తెల‌ప‌నున్న‌ట్లు పోలీసులు పేర్కొన్నారు.


logo