మంగళవారం 19 జనవరి 2021
Crime - Oct 17, 2020 , 18:26:52

పిల్ల‌ల‌ను చంపి త‌ల్లి ఆత్మ‌హ‌త్య

పిల్ల‌ల‌ను చంపి త‌ల్లి ఆత్మ‌హ‌త్య

‌ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం జ‌లౌన్ జిల్లాలో హృద‌య‌విదార‌క సంఘ‌ట‌న చోటుచేసుకుంది. ఓ 39 ఏండ్ల‌ మ‌హిళ త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌ను చంపేసి, ఆ త‌ర్వాత త‌న‌కు తాను ఉరేసుకుని చ‌నిపోయింది. మ‌హిళ చంపిన‌ వారిలో ఆమె 20 ఏండ్ల కూతురు, 15 ఏండ్ల కొడుకు ఉన్నారు. జ‌లౌన్ జిల్లా అయిత్ ప‌ట్ట‌ణం కోంచ్ స‌ర్కిల్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో ఈ దారుణం వెలుగుచూసింది. లారీ డ్రైవ‌ర్ అయిన స‌ద‌రు మ‌హిళ భ‌ర్త ప‌నిమీద బ‌య‌ట‌కు వెళ్లిన స‌మ‌యంలో మ‌హిళ ఈ ఘోరానికి ఒడిగ‌ట్టింద‌ని కోంచ్ స‌ర్కిల్ పోలీసులు తెలిపారు. 

స్థానికుల ఇచ్చిన స‌మాచారం మేర‌కు తాము ఘ‌ట‌నా ప్రాంతానికి వెళ్లామ‌ని, అప్ప‌టికే పిల్ల‌లిద్ద‌రూ ఇంట్లో ఫ్లోర్‌పై విగ‌త‌జీవులుగా ప‌డి ఉన్నార‌ని, త‌ల్లి ఫ్యాన్ వేలాడుతూ క‌నిపించింద‌ని పోలీసులు చెప్పారు. ప‌రిస్థితిని చూస్తే ముందుగా పిల్ల‌లిద్ద‌రినీ చంపేసి త‌ల్లి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లు తెలుస్తున్న‌ద‌ని తెలిపారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టామ‌ని, మృత‌దేహాల‌ను పోస్ట్ మార్టానికి త‌ర‌లించి, క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేక‌రిస్తున్నామ‌ని వెల్ల‌డించారు.      

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.