Crime
- Nov 29, 2020 , 15:18:10
పులి దాడిలో మహిళ మృతి

కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెంచికల్‌పేట మండలం కొండపల్లి గ్రామంలో నిర్మల(15) బాలికపై పెద్దపులి దాడి చేసి చంపేసింది. ఆదివారం ఉదయం తోటి కూలీలతో కలిసి బాలిక గ్రామానికి సమీపంలో ఉన్న చేనులోకి పత్తి ఏరడానికి వెళ్లింది. పత్తి ఏరుతుండగా మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో పెద్దపులి కనిపించడంతో కూలీలు అందరూ పరుగులు తీశారు. అక్కడ ఉన్న నిర్మలపైపులి దాడి చేయడంతో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. పక్షం రోజుల వ్యవధిలోనే ఇద్దరిపై దాడి చేసి చంపేయడంతో అటవీ గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కాగా.. మహారాష్ర్గ-తెలంగాణ సరిహద్దుల్లో కూడా రెండు రోజుల క్రితం కూడా పెద్దపులి ఒకరిని చంపేసింది.
తాజావార్తలు
- వివిధ కారణాలతో పలువురి ఆత్మహత్య
- సీసీ కెమెరాలు పట్టించాయి..
- సౌర విద్యుత్‌పై గ్రేటర్ వాసుల ఆసక్తి
- భరోసాతో బడికి
- ఈ రాశులవారికి.. ఆకస్మిక ధనలాభం
- యువత సన్మార్గం వైపు అడుగులేయాలి
- భయం వద్దు.. బర్డ్‌ఫ్లూ లేదు
- సంతోష్ బాబు పోరాటం.. సమాజానికి స్ఫూర్తిదాయకం
- కాంట్రాక్టు అధ్యాపకులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
- వారానికి 4 రోజులే.. కరోనా టీకా
MOST READ
TRENDING