బుధవారం 02 డిసెంబర్ 2020
Crime - Oct 12, 2020 , 12:22:57

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ఖమ్మం : రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని రఘునాధపాలెం మండలం ఖానాపురం సమీపంలో చోటు చేసుకుంది. మండలంలోని బూడిదపాడు గ్రామానికి చెందిన భార్యాభర్తలు ఖమ్మం నుంచి స్వగ్రామానికి బైక్‌పై వెళ్తుండగా.. వెనక నుంచి వచ్చిన టిప్పర్ లారీ వీరి బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో కిందపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. భర్తకు స్వల్ప గాయాలు కావడంతో చికిత్స కోసం దవాఖానకు తరలించారు. టిప్పర్ డ్రైవర్‌ను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.