శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Jul 11, 2020 , 10:01:53

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ఖమ్మం: జిల్లాలోని నేలకొండపల్లి మండల కేంద్రం సమీపంలోని చెరువు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఆటోను ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో మహిళ మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. నేలకొండపల్లి నుంచి ఖమ్మం వెళుతున్న ఆటోను ఖమ్మం నుంచి కోదాడ వెళుతున్న లారీ ఢీకొట్టింది. ఘటన జరిగిన వెంటనే లారీ డ్రైవర్‌ పరారయ్యాడు. లారీ అతివేగంగా రావడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికుల సమాచారం. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


logo