మంగళవారం 26 జనవరి 2021
Crime - Dec 01, 2020 , 15:20:08

కోతుల దాడిలో మహిళ మృతి

కోతుల దాడిలో మహిళ మృతి

సూర్యాపేట : జిల్లాలో విషాదం చోటు  చేసుకుంది. కోతులు ఓ మహిళపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని ఏమద్దిరాల మండలం కుక్కడం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..గ్రామానికి చెందిన దోమల శ్రీలత (23) ఇంట్లోకి వస్తున్న కోతులను వెళ్లగొట్టే క్రమంలో అవి దాడి చేయగా గడప మీద పడి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


logo