బుధవారం 02 డిసెంబర్ 2020
Crime - May 07, 2020 , 17:49:21

మినీ బస్సు ఢీ కొని మహిళ మృతి

మినీ బస్సు ఢీ కొని మహిళ మృతి

హైదరాబాద్‌ : మినీ బస్సు ఆమె పాలిట మృత్యు శకటమైంది. అప్పటిదాకా అందరితో కలిసి పని చేసిన ఆ మహిళ అంతలోనే మృత్యువాత పడిన విశాద ఘటన బాలానగర్‌లో చోటు చేసుకుంది. బాలానగర్ లోని చేరబండనగర్ లో నివాస ముండే కవిత (40) సోనీ ట్రాన్స్ పోర్ట్ లో నాలుగు నెలలుగా హౌస్ కీపింగ్ జాబ్ చేస్తున్నది. అయితే ఈ రోజు మధ్యాహ్నం భోజనం చేశాక చేతులు కడుక్కుంటున్న సమయంలో వాషింగ్ కోసం వెళ్తున్న మినీ బస్సు ఒక్కసారిగా ఆమె పైకి దూసుకెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను బాలానగర్ లోని ఓ ప్రైవేట్‌ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేప్పట్టారు. మృతురాలికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నాడు.