గురువారం 24 సెప్టెంబర్ 2020
Crime - Jun 25, 2020 , 07:05:25

స్లాబ్‌ పెచ్చులు ఊడిపడి మహిళ మృతి

స్లాబ్‌ పెచ్చులు ఊడిపడి మహిళ మృతి

కృష్ణా : జిల్లాలోని గుడివాడలో విషాదం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న కుటుంబంపై స్లాబ్‌ పెచ్చులు ఊడి మీద పడడంతో మహిళ మృతి చెందింది. గుడివాడలోని వీధిలో ఓ కుటుంబం మొదటి అంతస్తులో నివాసం ఉంటుంది. గురువారం తెల్లవారుజామున ఒక్కసారిగా స్లాబ్‌పెచ్చులు మీద పడడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందగా ఆమె భర్త, కుమారులిద్దరికి గాయాలయ్యాయి. గాయపడ్డ వీరిని స్థానిక ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు.  logo