శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Aug 29, 2020 , 17:22:32

చెరువులో బట్టలు ఉతికేందుకు వెళ్లి తల్లీకుమారుడు మృతి

చెరువులో బట్టలు ఉతికేందుకు వెళ్లి తల్లీకుమారుడు మృతి

ఉత్తరప్రదేశ్‌ : తల్లి చెరువులో బట్టలు ఉతుకుతుండగా కుమారుడు ఆడుతూ నీట మునగ్గా రక్షించే యత్నంలో తల్లీకొడుకులిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర ప్రదేశ్‌లోని లక్నో జిల్లా అర్జున్‌గంజ్‌ గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేకుంది. అర్జున్‌గంజ్ గ్రామంలోని గోటియా చెరువులో నజరీన్ (36) అనే మహిళ బట్టలు ఉతికేందుకు తన పదేళ్ల కుమారుడు సర్ఫరాజ్‌ను వెంట బెట్టుకొని వెళ్లింది. నజరీన్‌ బట్టలు ఉతుకుతుండగా సర్ఫరాజ్ (10) ఆడుకుంటూ లోతులోకి వెళ్లాడు. నీట మునుగుతుండటంతో కుమారుడిని కాపాడేందుకు తల్లి యత్నించగా ఇద్దరు నీట మునిగారు. స్థానికులు గుర్తించి వారిని బయటకు తీసి దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo