గురువారం 21 జనవరి 2021
Crime - Oct 06, 2020 , 13:18:14

యువ‌తికి మ‌త్తిచ్చి సామూహిక అత్యాచారం

యువ‌తికి మ‌త్తిచ్చి సామూహిక అత్యాచారం

జైపూర్‌: ‌రాజ‌స్థాన్ రాష్ట్రం చురు జిల్లాలో దారుణం జ‌రిగింది. న‌లుగురు యువ‌కులు ఓ యువ‌తికి కూల్ డ్రింక్‌లో మ‌త్తు క‌లిపి ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. చురు జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువ‌తి పోటీ ప‌రీక్ష‌ల‌కు ద‌ర‌ఖాస్తు చేసేందుకు స‌మీప ప‌ట్ట‌ణంలోని మీ సేవా కేంద్రానికి వెళ్లింది. అక్క‌డ ద‌ర‌ఖాస్తు ఫాం నింపుతుండ‌గా విక్ర‌మ్ అనే వ్య‌క్తి క‌నిపించాడు. తెలిసిన వ్య‌క్తే కావ‌డంతో యువ‌తి అత‌డి సాయంతో ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిచేసింది. 

అనంత‌రం కూల్ డ్రింక్ తాగుదామ‌నే వంక‌తో విక్ర‌మ్ ఆమెను బ‌య‌ట‌కు తీసుకెళ్లాడు. కూల్‌డ్రింగ్ షాప్ దూరం ఉంద‌ని చెప్పి త‌న స్నేహితులకు ఫోన్ చేశాడు. దాంతో ఓ కారులో అత‌ని ముగ్గురు స్నేహితులు వ‌చ్చారు. అనంత‌రం కూల్‌డ్రింక్స్ తీసుకుని విక్ర‌మ్ గ‌దికి వెళ్లారు. అక్క‌డ‌ యువ‌తి కూల్‌డ్రింక్‌లో మ‌త్తు క‌లిపి ఇచ్చారు. ఆమె మ‌త్తులోకి జారుకోగానే న‌లుగురు క‌లిసి సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. 

ఆ స‌మ‌యంలో వీడియోలు కూడా తీశారు. జ‌రిగిన విష‌యం ఎవ‌రికైనా చెప్పినా, పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా చంపేస్తామ‌ని, వీడియోలో సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తామ‌ని బెదిరించి పంపించారు. ఇంటికి వెళ్లిన యువ‌తి త‌ల్లిదండ్రుల‌కు చెప్ప‌డంతో వారు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందుతులు న‌లుగురిని అదుపులోకి తీసుకుని ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.    

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo