శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Aug 21, 2020 , 12:27:10

లిఫ్ట్ ఇస్తామ‌ని న‌మ్మించి.. మ‌హిళ‌పై సామూహిక అత్యాచారం

లిఫ్ట్ ఇస్తామ‌ని న‌మ్మించి.. మ‌హిళ‌పై సామూహిక అత్యాచారం

సిమ్లా : బ‌స్సు కోసం ఎదురుచూస్తున్న ఓ మ‌హిళ‌కు లిఫ్ట్ ఇస్తామ‌ని న‌మ్మించి.. ఏడుగురు దుండ‌గులు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ దారుణ ఘ‌ట‌న హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లోని కంగ్రాలో గురువారం చోటు చేసుకుంది. స‌లోల్ ఏరియాకు చెందిన 32 ఏళ్ల మ‌హిళ‌.. బ‌నోజ్ వ‌ద్ద బ‌స్సు కోసం ఎదురుచూస్తుంది. ఆమెకు లిఫ్ట్ ఇస్తామ‌ని న‌మ్మించిన ఏడుగురు.. కంగ్రాలోని ఓ ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఆ త‌ర్వాత అక్క‌డ్నుంచి ఓ హోట‌ల్‌కు త‌ర‌లించి మ‌రోసారి అఘాయిత్యానికి పాల్ప‌డ్డారు. బాధితురాలు త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై గ‌గ‌ల్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఏడుగురు నిందితుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo