శనివారం 31 అక్టోబర్ 2020
Crime - Sep 27, 2020 , 13:51:27

రైల్వే విశ్రాంతి గదిలోనే యువతిపై లైంగిక దాడి

రైల్వే విశ్రాంతి గదిలోనే యువతిపై లైంగిక దాడి

భోపాల్ : మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో దారుణం వెలుగు చూసింది. రైల్వే స్టేషన్‌ విశ్రాంతి గదిలోనే యువతి(22)పై రైల్వే ఉద్యోగితోపాటు అతడి సహచరుడు లైంగిక దాడికి ఒడిగట్టారు. వివరాలివి.. భోపాల్‌లోని డీఆర్‌ఎం కార్యాలయంలో కౌన్సెలర్‌గా పనిచేస్తున్న రాజేశ్‌ తివారీకి రెండు నెలల క్రితం ఫేస్‌బుక్‌లో యూపీకి చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించిన అతడు భోపాల్‌కు రావాలని సూచించాడు. శనివారం ఉదయం  7 గంటల సమయంలో భోపాల్‌ ఎక్స్‌ప్రెస్‌లో యువతి అక్కడికి వచ్చింది.

ఆమెను తివారీ వెంటబెట్టుకొని విశ్రాంతి గదికి తీసుకెళ్లాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిన అతడు మధ్యాహ్నం 12 గంటల సమయంలో మరో వ్యక్తితో తిరిగి వచ్చాడు. శీతల పానీయంలో మత్తుమందు కలిపి ఇచ్చి ఆమెపై ఇద్దరు లైంగిక దాడి చేశారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో స్పృహలోకి వచ్చిన ఆమె విషయంపై రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటికే రాజేశ్‌ తివారీని పోలీసులు అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారని రైల్వే ఎస్పీ హితేశ్‌ చౌదరి తెలిపారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.