Crime
- Sep 30, 2020 , 17:57:35
మహిళ మెడకు ఉరిబిగించి దారుణహత్య

ముంబై: మహారాష్ట్రలో దారుణం జరిగింది. పాల్ఘర్ జిల్లా చించోటి తాలూకాలోని కోల్హీ గ్రామ సమీపంలో ముంబై-అహ్మదాబాద్ రహదారి వెంబడి ఓ మహిళను హత్యచేసి పడేశారు. మహిళ మెడకు స్కార్ఫ్‌తో ఉరిబిగించి ఈ హత్యకు పాల్పడ్డారు. గ్రామస్తులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. నిందితులపై సెక్షన్ 302 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహిళ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
MOST READ
TRENDING